: అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కట్జూ
తన పదవికి రాజీనామా చేయాలన్న బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ కట్జూ మండిపడ్డారు. అసలు అరుణ్ జైట్లీనే తన రాజ్యసభ పదవికి రాజీనామా చేయాలని కట్జూ డిమాండ్ చేశారు. అర్థ సత్యాలు చెపుతూ, వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న అరుణ్ జైట్లీ రాజకీయాల్లో కొనసాగడానికి అనర్హుడని ఆయన విమర్శించారు.
కాంగ్రెసేతర రాష్ట్రాలపై కట్జూ తీరు, తనకు పదవి ఇచ్చిన వారిని సంతోషపెట్టే విధంగా ఉందని, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై కట్జూ వ్యాఖ్యలు వ్యక్తిగత విమర్శల్లా కనిపిస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.