: వరదలకు 73 మంది బలి
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ వరదల్లో మృతుల సంఖ్య 73కు పెరిగింది. ఈ వరదల్లో 72 వేల మంది చిక్కుకుకున్నారు. ఒక్క ఉత్తరాఖండ్లోనే 44 మంది చనిపోయారు. అనేక ఇళ్లు, భవంతులు కొట్టుకుపోయాయి. రుద్రప్రయాగ్ జిల్లాలో అలకనంద నది బీభత్సానికి 23 మంది మృతి చెందారు. 40 హోటల్స్తోపాటు 73 భవనాలు కొట్టుకుపోయాయి. చార్ధాం యాత్రలో 71,440 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ఉత్తరకాశీలో 9850 యాత్రికులు చిక్కుకుపోయారు. హిమాచల్ ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. 60 గంటలుగా చిక్కుకుపోయిన హిమాచల్ సీఎం వీరభద్రసింగ్, మరో 1700 పర్యాటకులను అధికారులు కాపాడారు. గంగా, దాని ఉపనదుల్లో వరద ఉధృతి తగ్గుతోంది.