: ఉత్తర కాశీలో చిక్కకుపోయిన 3,000 మంది తెలుగువారు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ సమీపంలో మూడు వేల మంది తెలుగు వారు చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియపరిచారు. వీరిని హెలికాప్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ఇక, గంగోత్రి, యమునోత్రి వద్ద 50వేల మంది వరకూ చిక్కుకుపోయారని భావిస్తున్నారు. వీరిని రక్షించేందుకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ గంగానది ఉధృతంగా ప్రవహిస్తూనే ఉంది. దీంతో సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతోంది.