: అద్వానీతో భేటీ అయిన మోడీ


గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఉదయం బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీతో భేటీ అయ్యారు. పార్టీ ఎన్నికల సారథిగా మోడీ నియమితుడవ్వడాన్ని అద్వానీ వ్యతిరేకించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆ పదవిలో నియమితులైన తర్వాత మోడీ తొలిసారిగా అద్వానీతో సమావేశం అయ్యారు. జేడీయూ అంశంతో పాటు, పలు అంశాలపై వీరిరువురి మధ్య చర్చ జరుగుతున్నట్లు సమాచారం. అద్వానీ నివాసంలో ఈ భేటీ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News