: అయోధ్యను సందర్శించనున్న మోడీ


బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ సారధిగా ఎన్నికైన గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ 15ఏళ్ల తర్వాత అయోధ్యను సందర్శించనున్నారు. వివాదాస్పద స్థలంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ఆలయంలో ఆయన పూజలు నిర్వహిస్తారని ఉత్తరప్రదేశ్ వీహెచ్ పీ ప్రతినిధి శరద్ శర్మ తెలిపారు. బుధవారం లేదా శుక్రవారం మోడీ అయోధ్యకు రానున్నారని చెప్పారు. ఈ పర్యటన ద్వారా రానున్న ఎన్నికల్లో అయోధ్య అంశం పార్టీకి కీలకమనే సందేశాన్ని కార్యకర్తలకు పంపనున్నారని శరద్ తెలిపారు. అయోధ్యలో బాబ్రీ కూల్చివేత తర్వాత అక్కడి దేవాలయాన్ని మోడీ సందర్శించడం ఇదే మొదటి సారి. 1998లో అద్వానీతో పాటు అయోధ్యకు వచ్చినా అక్కడి ఆలయాన్ని మాత్రం మోడీ దర్శించుకోలేదు.

  • Loading...

More Telugu News