: భద్రాచలం, రాజమండ్రి వద్ద గోదారమ్మ పరవళ్లు
రాజమండ్రిలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారమ్మ పరవళ్లు తొక్కుతోంది. భారీగా నీరు వస్తుండడంతో అధికారులు 2.65లక్షల క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం అక్కడ నీటి మట్టం 25.5 అడుగులకు చేరుకుంది. 29 అడుగులు దాటితే ప్రమాదక స్థాయిగా పరిగణిస్తారు.