: టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమాలోచనలు
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతుండటంతో తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందుకు సన్నద్ధమౌతున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో 'వస్తున్నా-మీ కోసం' పాదయాత్రలో ఉన్న చంద్రబాబుతో ఆ పార్టీ ఎంపీలు, సీనియర్ నేతలు భేటీ అయ్యారు.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలు నామా నాగేశ్వరరావు, రమేష్ రాథోడ్, దేవేందర్ గౌడ్, కొనకళ్ల నారాయణ, కోడెల శివప్రసాదరావు మొదలైన వారితో చంద్రబాబు చర్చించారు. అగస్టా హెలికాఫ్టర్ల కుంభకోణం, ఎఫ్ డీఐ, రైల్వే బడ్జెట్ వంటి ప్రధాన అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని టీడీపీ నేతలు ఈ సమావేశంలో నిర్ణయించారు.