: మీకు పది.. మాకు మూడా?: హరీశ్ రావు


తెలంగాణకు మరోసారి అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతి అంశంలోనూ తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని, తాజాగా కేంద్ర క్యాబినెట్ విస్తరణలో ఆ విషయం మరోసారి నిరూపితమైందని ఆయన విమర్శించారు. సీమాంధ్రులకు పది మంత్రి పదవులిచ్చిన కేంద్రం.. తెలంగాణకు కేవలం మూడు పదవులే ఇచ్చి అన్యాయం చేసిందని హరీశ్ రావు దుయ్యబట్టారు. ఆ మూడు మంత్రిత్వ శాఖలూ పెద్దగా ప్రాధాన్యంలేనివే అని మండిపడ్డారు. ఈ దారుణం చూసైనా కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి ఉద్యమబాట పట్టాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News