: ఖర్గేను పట్టాలెక్కించారు!
కర్ణాటక సీఎం పదవి ఆశించి ఆనక అసంతృప్తికి గురైన సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను రైల్వే శాఖ మంత్రి పదవితో ఊరడించారు. ఖర్గే ఇప్పటివరకు కేంద్ర కార్మికశాఖ మంత్రిగా వ్యవహరించారు. తాజాగా ఆయనను రైల్వే శాఖ మంత్రిగా నియమించారు. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించి కాంగ్రెస్ అధికార పీఠం హస్తగతం చేసుకోగా.. దళితనేత అయిన ఖర్గేను సీఎంగా ప్రకటించాలని కన్నడనాట దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే, కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్యకు సీఎం కుర్చీ అప్పగించింది. అప్పటినుంచి అలకబూనిన ఖర్గేను సంతృప్తి పరిచేందుకే అధిష్ఠానం రైల్వే శాఖను అప్పగించినట్టు తెలుస్తోంది. ముడుపుల వ్యవహారంలో పీకే బన్సల్ రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయగా.. సీపీ జోషీ తాత్కాలికంగా ఆ శాఖను చేపట్టారు. జోషి రెండ్రోజుల క్రితం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.