: తిరుమలలో వైభవంగా ముగిసిన చక్రస్నానం


రథసప్తమి పర్వదినం కావడంతో భక్తుల గోవింద నామ స్మరణతో తిరుమల మారుమ్రోగుతోంది. భక్తుల కోలాహలం మధ్య శ్రీవారి చక్రస్నానం ఘనంగా జరిగింది. అనంతరం భక్తులు పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

ఉదయం నుంచి స్వామివారి ఊరేగింపులతో తిరుమాడవీధులు శోభాయమానంగా మారాయి. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఊరేగింపు భక్తులకు కన్నుల పండగ తలపిస్తోంది. ఇవాళ ఉదయం నుంచి అమ్మవారు అశ్వ, గరుడ, పెద్ద శేష, సింహ వాహనాలలో తిరుమాడ వీధులలో ఊరేగారు. సాయంత్రం కూడా చంద్రప్రభ, గజవాహనాలపై అమ్మవారిని ఊరేగించనున్నారు. 
మరోవైపు శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామికి మార్చి 1 నుంచి 9 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News