: మంత్రులు.. శాఖలు..
కేంద్ర మంత్రి వర్గంలో నూతనంగా ఎంపికైన మంత్రులకు శాఖలు కేటాయించారు. కావూరి సాంబశివరావుకు క్యాబినెట్ హోదాలో జౌళి శాఖ కేటాయించారు. ఇక రాష్టానికే చెందిన జేడీ శీలంను సహాయ మంత్రి పదవి వరించింది. శీలం ఆర్ధిక శాఖ సహాయమంత్రిగా వ్యవహరిస్తారు. ఇక క్యాబినెట్ మంత్రుల హోదాలో ఆస్కార్ ఫెర్నాండెజ్ కు ఉపరితల రవాణా శాఖ, గిరిజా వ్యాస్ కు గృహ నిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ, శీష్ రాం ఓలాకు కార్మిక, ఉపాధి శాఖ కేటాయించారు. కాగా, సుదర్శన్ నాచియప్పన్ పారిశ్రామిక, వాణిజ్య శాఖ.. మాణిక్ రావు గవిట్ సామాజిక న్యాయం, సాధికారత శాఖ.. సంతోష్ చౌదరి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులుగా వ్యవహరిస్తారు.