: కష్టపడి పనిచేస్తానంటున్న కావూరి
మన్మోహన్ క్యాబినెట్లో స్థానం దక్కించుకున్న కావూరి సాంబశివరావు కష్టపడి పనిచేస్తానంటున్నారు. ఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వ్యవధి తక్కువగానే ఉన్నప్పటికీ విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని అన్నారు. సంకుచిత ధోరణికి తావులేని రీతిలో ముందుకెళతానని వివరించారు. కావూరికి కేంద్ర క్యాబినెట్ విస్తరణలో జౌళిశాఖ దక్కిన సంగతి తెలిసిందే. కాగా, తనకు మంత్రి పదవి దక్కడం పట్ల ఆయన ప్రధాని మన్మోహన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలకు ధన్యవాదాలు తెలిపారు.