: బంగారుతల్లి ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అభిమాన పథకం బంగారుతల్లి చట్టరూపానికి మంత్రివర్గం ఆమోదం లభించింది. ఈ రోజు మంత్రివర్గం బంగారుతల్లి పథకం ముసాయిదాకు ఆమోదముద్ర వేసింది. ఈ సాయంత్రం భేటీ అయిన మంత్రివర్గం దీనిపై చర్చించింది. మంగళవారం గానీ బుధవారంగానీ ఈ ముసాయిదా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టనున్నారని సమాచారం.