చరణ్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్.. రూ. 300 కోట్ల క్లబ్‌లో 'పెద్ది'

Ram Charan Peddi movie collects 315 crore gross in 5 days
  • 'పెద్ది' బాక్సాఫీస్ సునామీ.. ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు
  • 5 రోజుల్లో వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 315 కోట్లకు పైగా వసూలు చేసిన 'పెద్ది'
  • రామ్ చరణ్ కెరీర్‌లో వేగంగా రూ. 300 కోట్లు సాధించిన సోలో చిత్రంగా రికార్డు 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, విడుదలైన కేవలం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 315 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్‌ అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ నెల‌ 4న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి బుచ్చిబాబు సన దర్శకత్వం వహించారు. మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ‘పెద్ది’, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ విజయంతో రామ్ చరణ్ కెరీర్‌లోనే అత్యంత వేగంగా రూ. 300 కోట్ల క్లబ్‌లో చేరిన సోలో చిత్రంగా ‘పెద్ది’ రికార్డు సృష్టించింది.

గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ఒక కీలక పాత్రలో మెరిశారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. సుకుమార్ రైటింగ్స్, జియో స్టూడియోస్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించారు.
Go Back to Shorts
Ram Charan
Peddi movie collections
Buchi Babu Sana
Janhvi Kapoor
Peddi 300 crore club
Box office collection

More Telugu News