పెళ్లిపీటల నుంచి వధువు జంప్.. ఆమె చెల్లితో పెళ్లికి యత్నం.. ఆపై ఊహించని ట్విస్ట్!
- నగలతోపాటు వధువు అదృశ్యమవడంతో కుటుంబ సభ్యుల షాక్
- అవమానం తట్టుకోలేక చెల్లెలిని ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దల నిర్ణయం
- తాను వేరొకరిని ప్రేమిస్తున్నానంటూ పెళ్లికి తిరస్కరణ
- మండపంలో రాళ్లు, కర్రలతో కొట్టుకున్న ఇరు కుటుంబాలు
అయితే, ఈ ప్రతిపాదనకు ఆ చిన్న కూతురు నో చెప్పింది. తనకు వేరే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉందని, ఈ పెళ్లి చేసుకోనని స్పష్టం చేసింది. అంతేకాకుండా, ఆమె ప్రియుడు కూడా నేరుగా పెళ్లిమండపానికి చేరుకుని తామిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వరుడి వైపు వారు దీనిని తీవ్ర అవమానంగా భావించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఈ గొడవ కాస్తా ముదిరి పరస్పరం దాడులు చేసుకునే వరకు వెళ్లింది. ఇరుపక్షాలు కర్రలు, ఇటుకలు, రాళ్లతో దాడులు చేసుకోవడంతో వధువు తరపు బంధువులతో పాటు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బిథ్రి చైన్పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘర్షణకు కారణమైన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చివరికి, పెళ్లి పూర్తిగా రద్దు కావడంతో వరుడి తరపు వారు వధువు లేకుండానే వెనుతిరగాల్సి వచ్చింది.