: ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న కమేడియన్
ప్రముఖ హాస్యనటుడు అలీ తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో అలీ రాజకీయ ఆరంగేట్రంపై జరుగుతున్న ప్రచారానికి పులిస్టాప్ పడింది. గత కొంత కాలంగా రాజమండ్రి పరిధిలో ఏదైనా ఒక అసెంబ్లీ స్థానం నుంచి అలీని బరిలోకి దింపేందుకు అటు టీడీపీ, ఇటు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తున్నాయంటూ వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.