: తెలంగాణపై 15 రోజుల్లోగా ఓ ప్రకటన: శంకరరావు
15 రోజుల్లో తెలంగాణపై ఓ ప్రకటన రానుందని మాజీమంత్రి శంకరరావు అన్నారు. ఇప్పటికైనా హై కమాండ్ తెలంగాణపై ఏదో ఓ నిర్ణయం తీసుకోకపోతే తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. తనలాగే చాలామంది ఇదే ఆలోచనతో ఉన్నారని శంకరరావు తెలిపారు. తెలంగాణపై సరైన నిర్ణయం తీసుకోకపోతే కాంగ్రెస్ మనుగడే కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు.