బండి భగీరథ్ ను జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

Bandi Bhagirath Taken into Custody by Police from Jail
  • మైనర్ బాలికను లైంగికంగా వేధించాడంటూ కేసు
  • చర్లపల్లి జైలు నుంచి భగీరథ్ ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు
  • కూకట్‌పల్లి డీసీపీ పర్యవేక్షణలో జరుగుతున్న విచారణ
తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను మేడ్చల్ మల్కాజిగిరి కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈరోజు ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసులో మరింత లోతుగా విచారణ జరిపి, మరిన్ని కీలక వివరాలు రాబట్టేందుకు పేట్ బషీరాబాద్ పోలీసులు కోర్టును ఆశ్రయించగా... న్యాయస్థానం మూడు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం పోలీసులు చర్లపల్లి కేంద్ర కారాగారానికి చేరుకుని, భగీరథ్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

ముందుగా నిందితుడికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, భారీ భద్రత నడుమ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విచారణ ప్రక్రియ అంతా కూకట్‌పల్లి డీసీపీ ప్రత్యక్ష పర్యవేక్షణలో జరగుతోంది. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా పోలీసులు మరిన్ని సెక్షన్లను చేర్చిన నేపథ్యంలో, ఈ మూడు రోజుల కస్టడీ విచారణ అత్యంత కీలకంగా మారనుంది.

Go Back to Shorts
Bandi Bhagirath
Bandi Sanjay
Telangana Politics
POCSO Case
Pet Basheerabad Police
Medchal Malkajgiri Court
Police Custody
Charlapally Jail

More Telugu News