రాజస్థాన్ భవితవ్యం తేలే మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్

Rajasthan Royals Face Mumbai Indians Must Win for Playoffs
  • ఐపీఎల్ లో నేడు రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హార్దిక్ పాండ్యా
  • ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలిస్తే ప్లేఆఫ్స్ లోకి ఎంట్రీ
  • రాజస్థాన్ ఓడితో పంజాబ్ కింగ్స్ కు ప్రయోజనం
  • ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 2026లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. ప్లేఆఫ్స్ రేసులో నిలిచేందుకు తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడుతోంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

టాస్ గెలిచిన అనంతరం హార్దిక్ పాండ్య మాట్లాడుతూ.. "మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ పిచ్ చాలా బాగుంది, సాయంత్రానికి బ్యాటింగ్‌కు మరింత అనుకూలంగా మారుతుంది. ఈ సీజన్ మాకు కఠినంగా సాగినా, విజయంతో ముగించాలనుకుంటున్నాం" అని చెప్పాడు. విశ్రాంతిలో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ ఆడటం లేదని, అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్ జట్టులోకి వచ్చాడని తెలిపాడు.

రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. "మేం కూడా బౌలింగే ఎంచుకునేవాళ్లం. ఈ మ్యాచ్ గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాం, ఇతర మ్యాచ్‌ల ఫలితాలతో సంబంధం ఉండదు. అందుకే గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాం" అని ధీమా వ్యక్తం చేశాడు. జట్టులో మూడు మార్పులు చేసినట్లు, తనతో పాటు నాండ్రే బర్గర్, రవీంద్ర జడేజా తిరిగి జట్టులోకి వచ్చినట్లు తెలిపాడు.

నిన్న పంజాబ్ కింగ్స్ విజయం సాధించడంతో రాజస్థాన్ రాయల్స్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ప్లేఆఫ్స్‌లో నాలుగో బెర్తు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ తప్పనిసరిగా గెలవాలి. మరోవైపు, ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్.. తమ చివరి మ్యాచ్‌లో గెలిచి గౌరవంగా సీజన్‌ను ముగించాలని భావిస్తోంది.

రెండు జట్ల వివరాలు:

ముంబై ఇండియన్స్ 
ర్యాన్ రికెల్టన్(వికెట్ కీపర్), నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య(కెప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, ఏఎం ఘజన్‌ఫర్, రఘు శర్మ.

రాజస్థాన్ రాయల్స్ 
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), డొనోవన్ ఫెరీరా, శుభమ్ దూబే, దాసున్ శనక, జోఫ్రా ఆర్చర్, నండ్రే బర్గర్, యశ్ రాజ్ పుంజా, బ్రిజేష్ శర్మ.

ముంబై ఇండియన్స్ ఇంపాక్ట్ సబ్స్
రోహిత్ శర్మ, మయాంక్ రావత్, రాబిన్ మింజ్, క్రిష్ భగత్, ట్రెంట్ బౌల్ట్.

రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్స్
రవీంద్ర జడేజా, సుశాంత్ మిశ్రా, అమన్ రావ్ పెరాల, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే.


Go Back to Shorts
Hardik Pandya
Mumbai Indians
Rajasthan Royals
IPL 2026
Indian Premier League
Wankhede Stadium
Jasprit Bumrah
Riyan Parag
Playoffs
Cricket

More Telugu News