ఐపీఎల్ మ్యాచ్‌లో రచ్చ.. చీర్ లీడర్లతో అభిమానుల అసభ్య ప్రవర్తన.. ఇదిగో వీడియో!

IPL 2026 Match Controversy Fans Misbehave With Cheerleaders
  • లక్నోలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా గందరగోళం
  • చీర్ లీడర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కొందరు అభిమానులు
  • రంగంలోకి దిగి అభిమానులపై చర్యలు తీసుకున్న పోలీసులు
లక్నోలోని ఏకనా క్రికెట్ స్టేడియంలో ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా ఓ వివాదం చోటుచేసుకుంది. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో కొందరు అభిమానులు చీర్ లీడర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. ఈ ఘటనతో స్టేడియంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.

మ్యాచ్ జరుగుతుండగా, కొంతమంది ప్రేక్షకులు చీర్ లీడర్లను ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టారు. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అసభ్యంగా ప్రవర్తించిన అభిమానుల గుంపుపై చర్యలు తీసుకున్నారు. అక్కడి నుంచి వచ్చిన దృశ్యాల ప్రకారం, ఓ మహిళా పోలీస్ అధికారి కూడా అభిమానులతో మాట్లాడి వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. శ్రేయాస్ అయ్యర్ అద్భుత శతకంతో చెలరేగడంతో లక్నో సూపర్ జెయింట్స్‌పై పంజాబ్ కింగ్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పంజాబ్ ప్లేఆఫ్స్ ఆశలు మరింత మెరుగయ్యాయి. మరోవైపు, ఈ సీజన్‌లో లక్నోకు ఇది 10వ ఓటమి కావడం గమనార్హం. మ్యాచ్ అనంతరం లక్నో కెప్టెన్ రిషభ్ పంత్ మాట్లాడుతూ, ఈ సీజన్ తమ జట్టుకు ఎంతో సవాలుగా నిలిచిందని అంగీకరించారు.
Go Back to Shorts
IPL 2026
Lucknow Super Giants
Punjab Kings
Ekana Cricket Stadium
Cheerleaders
Rishabh Pant
Shreyas Iyer
IPL Controversy
Cricket Match

More Telugu News