ప్రభాస్ 'రెబెల్' సినిమా ఫ్లాప్ కావడానికి కారణం ఇదే: డార్లింగ్ స్వామి

Prabhas Rebel Movie Failure Reasons Explained by Darling Swamy
  • ప్రభాస్ హీరోగా రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన సినిమా
  • హీరోయిన్లుగా నటించిన తమన్నా, దీక్షా సేథ్
  • ప్రభాస్‌ను స్టైలిష్‌గా చూపించడంపైనే లారెన్స్ ఎక్కువ ఫోకస్ పెట్టారన్న డార్లింగ్ స్వామి

రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్‌లో అత్యంత స్టైలిష్ మాస్ యాక్షన్ చిత్రంగా నిలిచిన ‘రెబల్’ బాక్సాఫీస్ వద్ద ఎందుకు ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయిందనే అంశంపై ప్రముఖ రచయిత డార్లింగ్ స్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో తమన్నా, దీక్షా సేథ్ హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై డిజాస్టర్‌గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఫెయిల్ కావడానికి గల ప్రధాన కారణాలను ఆయన తాజా ఇంటర్వ్యూలో విశ్లేషించారు.


డార్లింగ్ స్వామి మాట్లాడుతూ.. ప్రభాస్ క్రేజ్, పైగా ‘కాంచన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత లారెన్స్ చేస్తున్న సినిమా కావడంతో అప్పట్లో ‘రెబల్’పై అంచనాలు ఆకాశాన్ని తాకాయన్నారు. అయితే, దర్శకుడు లారెన్స్ ఈ సినిమా కథ కంటే కూడా ప్రభాస్‌ను ఎంత స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయాలి, ప్రతి సీన్ ఎంత గ్రాండ్‌గా ఉండాలి అనే దానిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారని వివరించారు. యాక్షన్ సీక్వెన్సులు అద్భుతంగా డిజైన్ చేసినప్పటికీ, సినిమాను మరీ స్టైలిష్‌గా చూపించే ప్రయత్నంలో అసలు కథ కాస్త పక్కకు వెళ్ళిపోయిందని, అదే ఈ సినిమా పరాజయానికి ముఖ్య కారణమని ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, ప్రభాస్ కెరీర్‌లోనే మోస్ట్ స్టైలిష్ లుక్స్ ఉన్న చిత్రంగా ‘రెబల్’కు ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుందని డార్లింగ్ స్వామి చెప్పుకొచ్చారు.

Go Back to Shorts
Prabhas
Rebel Movie
Darling Swamy
Ragava Lawrence
Tamanna
Deeksha Seth
Telugu Cinema
Tollywood
Movie Review
Box Office Failure

More Telugu News