: నేరాల్లో పశ్చిమబెంగాల్‌ ఫస్టట


మనదేశంలో అత్యధిక నేరాలు నమోదైన రాష్ట్రంగా పశ్చిమ బెంగాల్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. నిర్భయ దుర్ఘటన జరగక ముందు... ఆ తర్వాత దేశంలో రోజూ ఇలాంటి నేరాలు ఎక్కడో ఒకచోటు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. చాలావరకూ అసలు పోలీసు స్టేషన్‌ గడప కూడా ఎక్కకుండానే మరుగున పడిపోతున్నాయి. ఈ నేపధ్యంలో జాతీయ నేర విభాగం గత ఏడాది మహిళలపై నమోదైన కేసుల వివరాలకు సంబంధించిన జాబితాను రాష్ట్రాల వారీగా విడుదల చేసింది. ఈ జాబితాలో గత ఏడాది ముఫ్పైవేలకు పైగా కేసులు నమోదైన పశ్చిమబెంగాల్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఈ కేసుల్లో ఎక్కువగా అత్యాచారానికి సంబంధించిన కేసులే ఉన్నట్టు పోలీసు శాఖ తెలిపింది.

ఇక రెండవ స్థానంలో మధ్యప్రదేశ్‌, ఆ తర్వాత స్థానంలో రాజస్థాన్‌ ఉన్నాయి. 2011లో కూడా పశ్చిమ బెంగాల్‌లో ఇలాంటి కేసులే ఎక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ ఇప్పటికైనా పరిస్ధితి తీవ్రతను అర్ధం చేసుకున్న మహిళలు అప్రమత్తతతో మెలగాలని, అత్యవసర పరిస్థితుల్లో ఆత్మరక్షణకు ఉపయోగపడే విద్యలను నేర్చుకోవాలని హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News