: పాక్ లో బూర్జ్ దుబాయ్ కంటే పెద్ద భవనం
ఇప్పటి వరకు ప్రపంచంలో ఎత్తైన భవనం ఏదని ప్రశ్నిస్తే ఎవరైనా టక్కున దుబాయ్ లోని 'బూర్జ్ ఖలీఫా' అని చెపుతారు. అయితే, ఈ ఖ్యాతి ఇకపై పాకిస్థాన్ పరం కానుంది. ఎందుకంటే పాకిస్థాన్ కరాచీ తీరంలోని ఓ ద్వీపంలో బూర్జ్ దుబాయ్ ని తలదన్నే నిర్మాణం చేపట్టేందుకు ఆ దేశ నిర్మాణ రంగ వ్యాపారి మాలిక్ రియాజ్ సన్నాహలు చేస్తున్నారు.
ఈ భవంతిని నిర్మించేందుకు మాలిక్, అబుదాబీకి చెందిన ఓ సంస్థతో 45 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్టు వల్ల 25 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు మాలిక్ తెలిపారు.