: 'నో లాస్' అంటున్న కిషన్ రెడ్డి
జేడీయూ.. బీజేపీతో పొత్తు తెంచేసుకోవడం పట్ల రాష్ట్ర బీజేపీ అగ్రనేత కిషన్ రెడ్డి స్పందించారు. జేడీయూ వీడినందువల్ల బీజేపీకి ఎలాంటి నష్టం వాటిల్లబోదని కిషన్ రెడ్డి ధీమాగా చెప్పారు. హైదరాబాద్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ.. పొత్తు తెగదెంపులు చేసుకునే విషయంలో ఆ పార్టీ తొందరపడిందని ఆయన అభిప్రాయపడ్డారు. వచ్చ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించి అధికారంలోకి రానుందన్న సంగతి తెలియకనే వారు బయటికెళ్ళిపోయారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీల బెదిరింపు రాజకీయలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని, తాము ఎవరి సహకారం లేకుండానే మెజారిటీ సాధిస్తామని ఆయన చెప్పుకొచ్చారు.