: జియా ఉదంతంలో నన్నెందుకు లాగుతారు?: సల్మాన్ ఆగ్రహం
జియా ఖాన్ వ్యవహారంలోకి తనను అనవసరంగా లాగుతున్నారని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. తాను జియా ఖాన్ ను ప్రేమించొద్దని సూరజ్ పంచోలీకి చెప్పినట్టు వచ్చిన వార్తలు అవాస్తవమని కొట్టిపారేశారు. ఈ ఉదంతంలో పదేపదే తన పేరు మీడియాలో వస్తుండడం పట్ల సల్మాన్ మండిపడ్డాడు. ఈ విషయమై నేడు వివరణ ఇచ్చాడు. జియా, సూరజ్ లను విడదీయమని తానెన్నడూ సూరజ్ తండ్రి ఆదిత్య పంచోలీకి చెప్పలేదని అన్నాడు. ఇదంతా మీడియా సృష్టే అని తెలిపాడు. కాగా, జియా మృతి పట్ల విచారం తెలుపుతూ, ఆమె తల్లి తనపై ఆరోపణలు చేయడాన్ని ఖండించాడు. అసలు జియా, సూరజ్ లు ప్రేమించుకుంటున్నట్టు తనకు తెలియదని స్పష్టం చేశాడు.