: విదేశీయులకు అమెరికా ఘన స్వాగతం


తమ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించిన భారత్, చైనా తదితర దేశాలకు చెందిన ప్రతిభావంతులను తమ దేశాభివద్ధికే ఉపయోగించుకునేందుకు అమెరికా కీలక బిల్లును తీసుకొస్తోంది. దీనికి సంబంధించిన స్టార్టప్ 3.0 బిల్లును సెనేటర్లు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)లో ప్రవేశపెట్టారు. ఇది ఆమోదం పొందితే కొత్తగా 1,25,000 వీసాలను విదేశీయులకు జారీ చేస్తారు. ఇందులో 50 వేల వీసాలు సైన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీ విద్యార్థుల కోసం కేటాయించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గాలం వేసేందుకు మరో 75వేల వీసాలను జారీ చేస్తారు.

విదేశీ విద్యార్థులకు గతంలోనూ వీసాలు మంజూరు చేసేవారు. కానీ, చదువు పూర్తయ్యాక వారు స్వదేశాలకు తిరిగిపోతున్నారు. ఇలాంటి వారిని అమెరికాలోనే స్థిరపడేలా చేసి, అభివృద్ధికి ఉపయోగించుకోవాలని అగ్రరాజ్యం వ్యూహం. ఇందుకోసం వీరికి భారీగా రాయితీలు, పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడానికి ఈ బిల్లులో నిబంధనలు పొందుపరిచారు.

అలాగే, వలసదారుల నిబంధనలనూ సరళీకరించారు. అంటే ప్రతిభావంతులను వ్యాపారాల స్థాపనకు ప్రోత్సహించి ఉద్యోగ అవకాశాలను
సృష్టించుకోవాలని ఒబామా యంత్రాంగం తహతహలాడుతోంది. అలాగే అత్యాధునిక పరిశోధనలలో విదేశీయుల మేధస్సుతో మరింత ముందడుగు వేయాలనే లక్ష్యం కూడా కనిపిస్తోంది. దీనికి గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ కంపెనీలు మద్దతు పలుకుతున్నాయి. ఇది భారతీయులకు శుభసూచికే.

  • Loading...

More Telugu News