: ఏపీ వ్యవహారాల ఇన్ ఛార్జిగా దిగ్విజయ్ సింగ్
రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి పదవి నుంచి గులాంనబీ ఆజాద్ ను తప్పించారు. ఆయన స్థానంలో ఇక నుంచి ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలను సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పర్యవేక్షిస్తారు. కాగా, ఆజాద్ కు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడిగా అవకాశం లభించింది. ఈమేరకు ఢిల్లీలో కాంగ్రెస్ అధికార ప్రతినిది జనార్థన్ ద్వివేది ప్రకటించారు.