: ఏఐసీసీ కార్యవర్గంలో కావూరికి చోటు
కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యవర్గంలో రాష్ట్రానికి చెందిన ఎంపీ కావూరి సాంబశివరావుకు చోటు దక్కింది. అంతేగాకుండా కావూరిని శాశ్వత ఆహ్వానితుడిగానూ నియమించారు. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) లోనూ మార్పులు చేశారు. సీడబ్ల్యూసీ సభ్యులుగా సోనియా, మన్మోహన్, ఆజాద్, ద్వివేది వ్యవహరిస్తారు.