: టీమిండియాలో హైదరాబాదీలేరీ?: వీవీఎస్ ఆవేదన
భారత క్రికెట్ జట్టుకు మరింతమంది హైదరాబాద్ క్రికెటర్లు ప్రాతినిధ్యం వహించాలని మణికట్టు మాంత్రికుడు వీవీఎస్ లక్ష్మణ్ ఆకాంక్షించారు. హైదరాబాద్ క్రికెట్ సంఘం నిర్వహించిన టోర్నీల్లో ప్రతిభ కనబర్చిన క్రికెటర్లకు నేడు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్ మాట్లాడుతూ, నగరం నుంచి ఎక్కువమంది క్రికెటర్లు అంతర్జాతీయస్థాయికి ఎదగాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాగా, అవార్డుల ప్రదానోత్సవానికి లక్ష్మణ్ తోపాటు భారత మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ వెంకటపతిరాజు కూడా హాజరయ్యారు. లక్ష్మణ్ ఇటీవలే క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.