: క్యాబినెట్ రేసులో వీహెచ్!


కేంద్ర మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరణ చేయనుండడంతో రాష్ట్రంలోని ఆశావహుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. అందరిలోకెల్లా కావూరి సాంబశివరావు పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, తెలంగాణ ప్రాంత నేత వి. హనుమంతరావు కూడా కేంద్రం జాబితాలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. వీహెచ్ తో పాటు మరో తెలంగాణ నేత నంది ఎల్లయ్యకూ కేంద్ర క్యాబినెట్లో చోటు లభిస్తుందంటున్నారు. కాగా, కావూరికి అధిష్ఠానం నుంచి ఫోన్ రావడంతో ఆయన ఢిల్లీకి పయనమయ్యారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News