: మామ నాకు చేసిందేమీ లేదు, అంతా స్వయంకృషే: రజనీ అల్లుడు ధనుష్
తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ మామపై వ్యాఖ్యానించారు. కెరీర్ పరంగా ఆయన తనకు చేసిందేమీలేదని, తాను స్వయంకృషితోనే ఎదిగానని చెప్పుకొచ్చారు. రజనీకాంత్ అల్లుడిగా ఉండడం వల్ల తనకేమీ ఒరగలేదని అన్నారు. ఆయన ప్రభావం తనపై లేదని వివరించారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ దక్షిణాది యువ హీరో తన అభిప్రాయాలను పంచుకున్నారు. తన మామ రజనీకాంత్ నటనతో తన నటనను పోల్చడం సరికాదని ఈ బక్కపల్చని హీరో వ్యాఖ్యానించాడు.
ఎవరిశైలి వారిదే అంటూ.. తాను నటించే సినిమాల కథా వస్తువు డిఫరెంట్ గా ఉంటుందని వివరణ ఇచ్చాడు. ఇక తామిద్దరూ కలిస్తే సినిమాల గురించి చర్చించుకోమని తెలిపాడు. 'రాన్ జానా'తో ధనుష్ కొద్దిరోజుల్లో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక, భార్య ఐశ్వర్య తాను హిందీ మాట్లాడడం పట్ల థ్రిల్ ఫీలయిందని చెప్పాడీ ఎనర్జిటిక్ హీరో.