: బాలీవుడ్ తారకు హైదరాబాద్ వాటర్ బోర్డు 'రెడ్ నోటీస్'


బాలీవుడ్ నటి దియా మీర్జాకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్ బీ) రెడ్ నోటీస్ జారీ చేసింది. హైదరాబాద్ లోని దియా మీర్జా నివాసానికి సంబంధించి రెండేళ్ళకు పైగా నీటి బకాయిలు చెల్లించాలని వాటర్ బోర్డు తెలిపింది. 2008 నుంచి మీర్జా రూ.2. 26 లక్షలు బకాయి పడిందని బోర్డు వెల్లడించింది. ఈ విషయమై తాము ఎన్నోసార్లు జూబ్లీ హిల్స్ లోని దియా మీర్జా నివాసానికి నోటీసులు పంపినా స్పందన కరవైందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా, రెడ్ నోటీస్ జారీ చేసిన 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించకపోతే, సంబంధిత ఆస్తులను జప్తు చేస్తారని మెట్రో వాటర్ బోర్డు వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News