: రైల్వే మంత్రి రాజీనామా
కేంద్రంలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా రైల్వే మంత్రి పదవికి సీపీ జోషి రాజీనామా చేశారు. ముడుపుల వ్యవహారంతో పీకే బన్సల్ పదవిని వీడడంతో.. జోషి రైల్వే మంత్రిగా అదనపు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అజయ్ మాకెన్ నిన్న రాత్రి మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరి రాజీనామాలను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు ఆమోదించారు. కాగా, రేపు సాయంత్రం ఐదున్నర గంటలకు కేంద్ర క్యాబినెట్లో మార్పులు చేర్పులను ప్రకటించనున్నారు. ఈమేరకు కాంగ్రెస్ హైకమాండ్ యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కసరత్తులు చేస్తోంది.