: 'ప్లీజ్ హెల్ప్ మీ' అంటోన్న కరుణానిధి!
కరుణానిధి కుమార్తెగా కంటే 2జీ స్కాంలో నిందితురాలిగానే కనిమొళికి బాగా ప్రాచుర్యం లభించింది. ఆమె రాజ్యసభ సభ్యత్వం వచ్చేనెలతో ముగియనున్న నేపథ్యంలో మరోసారి తనయను పెద్దల సభకు పంపాలని కరుణానిధి కృతనిశ్చయం కనబరుస్తున్నారు. అయితే, స్వంతంగా కనిమొళిని రాజ్యసభకు పంపే బలం డీఎంకే పార్టీకి లేకపోవడంతో కాంగ్రెస్ మద్దతు కోరాలని ఈ రాజకీయ దిగ్గజం భావిస్తున్నారు. ఈ నెల 27న తమిళనాడులో రాజ్యసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అవసరమైతే మరికొన్ని మిత్రపక్షాలనూ సాయం కోసం అర్థించాలని ఈ పెద్దాయన సిద్ధమైనట్టు తెలుస్తోంది.