: నరకం చవిచూసిన ఎయిరిండియా ప్రయాణికులు


ఎవరైనా విమానంలో ఎందుకు ప్రయాణించాలనుకుంటారు? త్వరగానూ, అత్యంత సౌకర్యవంతంగానూ గమ్యానికి చేరాలనే కదా! ఇలాగే అనుకుని ఓ వందమంది ప్రయాణికులు ఎయిరిండియావారి విమానంలో ముంబయి నుంచి సింగపూర్ వెళ్ళాలనుకున్నారు. వారిలో సింగపూర్లో ఉద్యోగం చేస్తున్నవారు, పెళ్ళికి హాజరవ్వాలనుకున్నవారు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళూ ఉన్నారు. విమానం శుక్రవారం అర్థరాత్రి 12.15కి బయల్దేరాల్సి ఉంది. ప్రయాణికులందరూ తమ బ్యాగేజిలతో సిద్ధమయ్యారు. మరో ఐదు గంటల్లో తాము సింగపూర్లో ఉంటామని యోచిస్తోన్న వారికి తెలియదు, తెరవెనుక ఏం జరుగుతుందో.

క్షణాలు నిమిషాలయ్యాయి, నిమిషాలు గంటలయ్యాయి.. ఇలా, కాలం కరుగుతున్నా, విమానం బయల్దేరుతున్న దాఖలాలు కనిపించడంలేదు. దీంతో, వారిలో కొద్దిగా అసహనం మొదలైంది. అది క్రమేపీ చిరాకులా రూపుదాల్చి, ఆగ్రహమై వెల్లువెత్తింది. కారణం, చివరికి ఆ ప్లేన్ బయల్దేరేసరికి శనివారం మధ్యాహ్నం 2 గంటలైంది. ఈ అంతరాయానికి చింతిస్తున్నామని ప్రకటించి చేతులు దులిపేసుకున్న ఎయిరిండియా ఆలస్యానికి చెప్పిన కారణమేంటంటే.. విమానం నడపాల్సిన పైలెట్ మహాశయులిద్దరూ పత్తా లేరట. ఇలా ఉంటాయి, మన జాతీయ విమానయాన సంస్థ లీలలు!

  • Loading...

More Telugu News