: ఇంట ఓడినా రచ్చ గెలిచిన ప్రేమజంట!


ప్రేమే నేరమైంది. ఆ యువతీయువకుల పాలిట కన్నవాళ్ళే కాలయముళ్ళయ్యారు. కులాలు వేరంటూ పరువు హత్య కోసం వారిని వెంటాడారు. దాంతో ఆ ప్రేమికులు దేశంగాని దేశం చేరారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. పంజాబ్ కు చెందిన ఓ సిక్కు మతస్థుడు ఓ వెనకబడిన కులానికి చెందిన హిందూ అమ్మాయిని ప్రేమించాడు. అబ్బాయి తరుపు వారు పెళ్ళిని వ్యతిరేకించడంతో వారిద్దరూ 2007లో రహస్యంగా ఒక్కటయ్యారు. పెద్దవాళ్ళకు భయపడి ఆ జంట విడివిడిగానే ఉన్నారు. ఇక ఆ ఎడబాటును భరించలేక వారిద్దరూ 2008లో ఆస్ట్రేలియా వెళ్ళారు. భారత్ లో తమకు ప్రాణహాని ఉందని, శరణార్థుల హోదాలో తమకు ఆశ్రయం కల్పించాలని ఆసీస్ సర్కారును కోరగా, వారు నిరాకరించారు. అయితే, పట్టువిడవకుండా పోరాడిన ఆ జంటకు కాన్ బెర్రా కోర్టు ఊరటనిచ్చింది. వారిద్దరూ ఆస్ట్రేలియాలో ఉండవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • Loading...

More Telugu News