: దాయాదులు చాపచుట్టేశారు!
భారత్ తో మ్యాచ్ అంటే కొదమసింహాల్లా పోరాడతారనుకున్న పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. చాంపియన్స్ ట్రోఫీలో 40 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో దాయాదులు స్వల్ప స్కోరుతోనే సరిపెట్టుకున్నారు. కనీసం పూర్తి ఓవర్లైనా ఆడకుండానే.. 39.4 ఓవర్లలో 165 పరుగులకే చాపచుట్టేశారు. భారత బౌలర్లు పిచ్ స్థితిగతులను అనుకూలంగా మలుచుకుని పాక్ బ్యాట్స్ మెన్ పనిబట్టారు. పేసర్లు భువనేశ్వర్, ఇషాంత్ పదునైన స్వింగర్లతో రెచ్చిపోగా.. జడేజా, అశ్విన్ స్పిన్ మాయాజాలంతో దాయాది జట్టును ఉక్కిబిక్కిరి చేశారు. వీరందరూ తలో రెండు వికెట్లు సాధించారు. కాగా, పాక్ జట్టులో అసద్ షఫీక్ (41) టాప్ స్కోరర్ గా నిలిచాడు.