: తెలంగాణ నేతల ఢిల్లీ పయనం


తెలంగాణ పరిస్థితులను అధిష్టానానికి వివరించాలని, దీనికోసం ఢిల్లీ వెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు నిర్ణయించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పార్టీ అధిష్ఠానంపై ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. సచివాలయంలోని మంత్రి జానారెడ్డి ఛాంబర్‌లో తెలంగాణ మంత్రులు, ఎంపీల సమావేశం ముగిసింది. ఈనెల 18న తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశం కావాలని నిర్ణయించారు. జానారెడ్డితో సమావేశమైన వారిలో ఎంపిలు పొన్నం ప్రభాకర్, పాల్వయి గోవర్థన్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాపోలు ఆనంద్ భాస్కర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు నర్సారెడ్డి, మంత్రులు శ్రీధర్ బాబు, సుదర్శన్ రెడ్డి, బస్వరాజు సారయ్య ఉన్నారు. ఈ నెలాఖరున హైదరాబాద్‌లో పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసే యోచనలో కూడా వారు ఉన్నారు. ఆ తరువాత ఢిల్లీ వెళ్లి పరిస్థితి వివరించాలని వారు అనుకుంటున్నారు.

  • Loading...

More Telugu News