: టీటీడీకి పదిహేడు వందల యాభై కళ్లు


టీటీడీ భద్రత, నిఘా అవసరాల కోసం 62 కోట్లు వెచ్చించి 1750 సీసీ కెమేరాలు కొనుగోలుకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. తిరుమలలో జరిగిన పాలకమండలి సమావేశంలో సభ్యులు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గురువారం మినహా రాత్రిపూట వీఐపీ విరామ దర్శనాల రద్దును కొనసాగించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించింది. సంగీత విద్వాంసురాలు కన్యాకుమారిని టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసురాలిగా నియమించాలని పాలకమండలి నిర్ణయించింది. పాలు, పెరుగు, మజ్జిగ కోసం 8,18,68,500 రూపాయలతో టెండర్ల ఆమోదానికి నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వాజ్ఞ్మయ ప్రాజెక్టు సంచాలకునిగా మేడసాని మోహన్ పదవీకాలం ముగియడంతో మరో ఏడాది పొడిగించారు.

  • Loading...

More Telugu News