: తెరకెక్కనున్న 'అజ్జూ భాయ్' జీవితం


భారత క్రికెట్ కు అంతర్జాతీయ వేదికలపై ప్రముఖ స్థానం కల్పించిన కెప్టెన్లలో మహ్మద్ అజహరుద్దీన్ అగ్రగణ్యుడు. పలు చిరస్మరణీయ విజయాలు అజార్ ను అందలం ఎక్కించినా.. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఈ హైదరాబాదీ ప్రతిష్ఠ పాతాళానికి దిగజారింది. అయితే, క్రికెట్ తనను వద్దనుకుంటే, ఈయనా క్రికెట్ ను వద్దనుకున్నాడు. ఎంచక్కా రాజకీయాలను ఎంచుకుని ఎంపీగా ఎన్నికై యూపీ కాంగ్రెస్ లో ప్రముఖ స్థానం సంపాదించుకున్నాడు.

అయితే, డొక్కు సైకిల్ తొక్కుకుంటూ క్రికెట్ మైదానానికి వెళ్ళి.. తనకిష్టమైన ఆటను నేర్చుకునేందుకు తపించిన చిన్నారి.. భారత జట్టును శాసించే కెప్టెన్ గా ఎలా ఎదిగాడు? అతను నిజంగా ఫిక్సరేనా? అజార్ ను అప్రదిష్ఠ పాల్జేసేందుకు ఎవరైనా కుట్ర పన్నారా? అన్న అంశాలను సృజిస్తూ ఓ సినిమా తెరకెక్కనుంది.

సీరియళ్ళతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఏక్తా కపూర్ ఇప్పుడు అజ్జూ భాయ్ జీవితాన్ని సినిమాగా మలచాలని నిర్ణయించుకుంది. ఈ ఏడాది చివర్లో షూటింగ్ పనులు మొదలు పెట్టాలని ఈ టీవీ సీరియళ్ళ నిర్మాత తెలిపింది. కాగా, అజ్జూ పాత్రకు సైఫ్ అలీ ఖాన్, రణ్ బీర్ కపూర్, రణ్ వీర్ సింగ్ ల పేర్లను పరిశీలిస్తున్నారు.

  • Loading...

More Telugu News