: పెరగనున్న పెట్రోల్ ధరలు
పెట్రోల్ ధరలు మరోసారి కళ్ళెం తెంచుకోనున్నాయి. పెట్రోల్ ధరను లీటర్ ఒక్కింటికి 2 రూపాయల మేర పెంచాలని భారత చమురు రంగ సంస్థలు నిర్ణయించాయి. అంతర్జాతీయ విపణిలో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పతనం కావడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో, భారత్ లో పెట్రోల్ ధర పెంచక తప్పడంలేదని చమురు సంస్థలు అంటున్నాయి. ధరల పెంపు ప్రతిపాదనలకు భారత పెట్రోలియం శాఖ ఆమోదముద్ర వేస్తే రేపటి నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయి. కాగా, మే 31 పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 75 పైసలు పెంచిన సంగతి తెలిసిందే.