: కళలకు మతాన్ని అంటగట్టవద్దు: అక్షయ్ కుమార్
కమల్ హాసన్ రూపొందించిన ’విశ్వరూపం‘ చిత్రం తమిళనాడులో నిషేధానికి గురికావడంపై బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. ముంబైలో ఓ కార్యక్రమంలో మాట్లాడిన అక్షయ్, కళలకు మతాన్ని అంటగట్టవద్దనీ, సున్నిత మనస్తత్వం కలిగిన కమల్ ను బాధ పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఈ సినిమాపై నిషేధం సరికాదని బాలీవుడ్ ముక్త కంఠంతో చెబుతోంది. శుక్రవారం మహారాష్ట్ర వ్యాప్తంగా 'విశ్వరూపం' విడుదలైన సంగతి తెలిసిందే.