: బాబు హామీలన్నీ ఆచరణ సాధ్యమే: యనమల


అన్ని రకాలుగా అధ్యయనం చేశాకే ఆచరణ సాధ్యమైన హామీలను చంద్రబాబు ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. అధికారంలోకి వస్తే వీటిని అమలు చేయడానికి సంబంధించి ఒక ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు.

చంద్రబాబు హామీలపై సీఎం కిరణ్ కుమార్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యల ద్వారా కష్టాలలో ఉన్న రైతులను అవమానించారని అన్నారు. ఢిల్లీ చుట్టూ తిరిగే కాంగ్రెస్ నేతలకు ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో అవినీతి, అక్రమాలే ప్రధానాంశాలైతే.. టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయమని చెప్పారు. 

  • Loading...

More Telugu News