: ఈ జబ్బుని ఇట్టే పసిగట్టేయొచ్చు!


మెలనోమా చర్మ క్యాన్సర్‌ను కేవలం చర్మాన్ని వాసన చూడడం ద్వారా పసిగట్టేయొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చర్మ క్యాన్సర్లలో ప్రమాదకరమైన మెలనోమాను గుర్తించడానికి మానవ చర్మ కణాలనుండి వచ్చే వాసనలను బట్టి గుర్తించవచ్చని అమెరికాలోని మానెల్‌ సెంటర్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు. ఈ విధానాన్ని వీరు అభివృద్ధి చేశారు. మెలనోమా కణాలతో సంబంధం ఉన్న ప్రత్యేక వాసనను గుర్తించడంతోబాటు నానో టెక్నాలజీ ఆధారిత సెన్సర్‌ను వీరు రూపొందించారు. ఈ సెన్సర్‌ సాధారణ చర్మ కణాలకు, మెలనోమా ఉన్న చర్మ కణాలకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని గుర్తించగలదు. దానివల్ల ఈ వ్యాధిని ముందుగానే పసిగట్టడానికి వీలవుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ప్రస్తుతం మెలనోమా వ్యాధిని గుర్తించడానికి కంటితో పరీక్షించడం ద్వారా ఎక్కువగా గుర్తిస్తున్నారు. అయితే ఇది సదరు వైద్యుడి నైపుణ్యంపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అయితే మానవ చర్మం అనేక అస్ధిరమైన సేంద్రియ పదార్ధాలను ఉత్పత్తి చేస్తుంది. వీటికి చాలా రకాలైన వాసనలు ఉంటాయి. అయితే మెలనోమా కణాలనుండి వచ్చే వాసనలను గుర్తించే విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ వ్యాధి ఉన్న చర్మం వాసనను నానో టెక్నాలజీ ఆధారిత సెన్సర్‌ గుర్తించేలా వీరు ఈ విధానాన్ని వృద్ధి చేశారు.

  • Loading...

More Telugu News