: విండీస్ విజయలక్ష్యం 231


ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ బీలో విండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో సఫారీలు 31 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసారు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ ను 31 ఓవర్లకు అంపైర్లు కుదించారు. దీంతో టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికాలో ఇంగ్రామ్(73), మిల్లర్(38), డివిలీర్స్(37), ప్లెసిస్(35), ఆమ్లా(23) పరుగులతో రాణించారు. దీంతో సౌత్ ఆఫ్రికా 231 పరుగుల విజయలక్ష్యాన్ని విండీస్ కు విధించింది. విండీస్ బౌలర్లలో బ్రావో రెండు వికెట్లు తీయగా, శామ్యూల్స్, పోలార్డ్, రవిరాంపాల్ తలా వికెట్ తీసారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు సెమీస్ కు చేరుకోనుంది.

  • Loading...

More Telugu News