: టైటిల్ కు రెండడుగుల దూరంలో సైనా
టైటిల్ పోరుకు రెండడుగుల దూరంలో సైనా అద్భుత ప్రదర్శన చేస్తోంది. ఇండోనేషియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో సైనా తిరుగులేని ఆటతీరుతో ఆకట్టుకుంది. టోర్నీ క్వార్టర్స్ లో సైనా స్పెయిన్ షట్లర్ కరోలీనాను 21-16, 21-19 తేడాతో ఓడించింది. కేవలం 39 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్ లో సైనా, కరోలీనా మారిన్ ను ఊపిరి తీసుకోనివ్వలేదు. స్మాష్ లు, ఏస్ లు, డ్రాపులతో సైనా సివంగిలా విరుచుకుపడింది. సైనా ధాటికి కరొలీనా సింపుల్ గానే తోక ముడిచింది.