: 2028 నాటికి అత్యధిక జనాభా గలిగిన దేశంగా భారత్


ప్రపంచంలో అత్యధిక జనాభాగల దేశంగా భారత్ అవతరించనుంది. ఏంటి, నమ్మలేకపోతున్నారా? మీరు విన్నది నిజమే. ఇప్పుడు రెండో స్థానంలో ఉన్న మనదేశం మరో 16 ఏళ్ల తరువాత చైనాను మించిపోనుందట. యూఎన్ కు చెందిన వరల్డ్ పాపులేషన్ ప్రొస్పెక్ట్స్ విడుదల చేసిన లెక్కల ప్రకారం మన దేశం 2028 నాటికి 1.45 బిలియన్ మార్కును దాటిపోతుంది. ఈ సంస్థ విడుదల చేసిన లెక్కల ప్రకారం మరో నెలలో ప్రపంచ జనాభా 7.2 బిలియన్ మార్కును దాటిపోతుందని తెలిపింది. ఈ జనాభా 2100 వ సంవత్సరం నాటికి 10.9 బిలియన్లకు చేరుకుంటుందని తెలిపింది. ఈ భారీ పెరుగుదల అభివృద్ధి చెందుతున్న వర్ధమాన నగరాల్లో ఎక్కువ ఉంటుందని తెలిపింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లో ఈ పెరుగుల భారీగా ఉంటుందని సదరు సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News