: సీబీఐకి గుజరాత్ హైకోర్టు మొట్టికాయలు


కొన్నేళ్ళ క్రితం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఇష్రాత్ జహాన్ నకిలీ ఎన్ కౌంటర్ కేసులో సీబీఐకి గుజరాత్ హైకోర్టు మొట్టికాయలు వేసింది. కొన్ని విషయాలను స్వయంగా నిర్ధారించుకోకుండా, కేవలం ఇంటలిజెన్స్ బ్యూరో అందించే వివరాలపై ఆధారపడడం సరికాదని హితవు పలికింది. ఆ ఘటనలో చనిపోయిన వ్యక్తులు ఉగ్రవాదులా? కాదా?.. ఆ ఎన్ కౌంటర్ వాస్తవమా? బూటకమా? అని తేల్చుకోకుండానే దర్యాప్తు కొనసాగించడమేంటని హైకోర్టు అక్షింతలు వేసింది. ఇక ఛార్జిషీటు దాఖలు చేయడానికి ఎంత సమయం తీసుకుంటారంటూ ప్రశ్నించింది.

2004, జూన్ 15న గుజరాత్ లోని అహ్మదాబాద్ వద్ద ఓ వాహనంలో ప్రయాణిస్తున్న ఇష్రాత్ జహాన్, జావేద్ షేక్, అంజాద్ అలీ రాణా, జీషన్ జోహార్, ప్రణేశ్ పిళ్ళైలను ఉగ్రవాదులన్న నెపంతో గుజరాత్ టాస్క్ ఫోర్స్ ఎన్ కౌంటర్లో హతమార్చింది.

  • Loading...

More Telugu News