: పోప్ కు కొత్త బైకులు కానుకగా ఇవ్వనున్న 'హార్లే డేవిడ్సన్'


ప్రఖ్యాత మోటార్ సైకిళ్ళ తయారీదారు 'హార్లే డేవిడ్సన్' పోప్ ఫ్రాన్సిస్ కు రెండు కొత్త బైకులు కానుకగా ఇవ్వాలని నిర్ణయించింది. సంస్థ 110వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పోప్ కు క్లాసిక్ మోటార్ సైకిళ్ళు బహూకరించాలని కంపెనీ తలపోస్తోంది. ఆదివారం జరిగే ఓ కార్యక్రమంలో కంపెనీకి చెందిన వందలకొద్దీ 'హార్లే డేవిడ్సన్' బైకులను వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పార్క్ చేయనున్నారు. ఈ కంపెనీ స్థాపించి శతాబ్దంపైగా కావస్తోన్న నేపథ్యంలో పోప్ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు.

  • Loading...

More Telugu News