: కర్ణాటకపై తమిళనాడు పోరు
కర్ణాటక, తమిళనాడుల మధ్య కావేరీ జలవివాదం రోజురోజుకూ ముదురుతోంది. కావేరీ జలాల వివాదంలో కర్ణాటకపై రేపు కోర్టు ధిక్కారణ పిటీషన్ దాఖలు చేయడానికి తమిళనాడు నిర్ణయించింది. నిన్నటివరకూ కేంద్ర జలసంఘం ముందు వాదనలు వినిపించిన తమిళనాడు, ఫలితం లేకపోవడంతో న్యాయపోరాటానికి దిగేందుకు నిర్ణయించింది. కావేరీ నదీ జలాలను ఒప్పందం ప్రకారం విడుదల చేయడం లేదని, కర్ణాటక కావేరీ నదిపై అదనపు ఆనకట్టలను నిర్మించి జలదోపిడీకి పాల్పడుతోందంటూ ఇప్పటికే పలు మార్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో స్పెషల్ ట్రిబ్యునల్ నాలుగేళ్లు విచారణచేసి కొన్ని సూచనలు చేసింది. వీటిని కర్ణాటక ఉల్లంఘిస్తోందంటూ మరో మారు కోర్టును ఆశ్రయించనుంది తమిళనాడు.